
ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ప్రేమలు, పెళ్లిళ్లు, ఎఫర్స్ కారణంగా వార్తల్లో ఎక్కువగా నిలిచారు. సినిమాలతో ఎంత క్రేజ్ తెచ్చుకుంటారో .. ఎఫైర్స్ తో అంత పాపులర్ అయిన వారు కూడా ఉన్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. కొంతమంది ఇద్దరుముగ్గురితో ఎఫైర్స్ నడిపిన వారు ఉన్నారు.

ఇక ఈ మధ్య విడాకులు హడావిడి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న చాలా మంది సెలబ్రెటీలు విడిపోతున్నారు. సోషల్ మీడియా విడిపోతున్నట్టు చేసి అభిమానులకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ క్రేజీ హీరోయిన్ తనకు ఇద్దరు లవర్స్ ఉన్నారని చెప్పి అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది.

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన విజయదశమి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ వేదిక. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ ఈ చిన్నదానికి అనుకున్నంత స్థాయిలో బ్రేక్ రాలేదు.

వేదిక నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. బాణం సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత ఎక్కువగా తమిళ్, మలయాళ, కన్నడ బాషల పై ఫోకస్ చేసింది. చివరిగా రజాకార్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే గతంలో వేదిక చేసిన కామెట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. తన జీవితంలో ఇద్దరు ప్రేమికులు ఉన్నారని తెలిపింది వేదిక.

గతంలో పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు సంధానమిస్తూ .. నా జీవితంలో ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. వాళ్ళు నా చివరి వరకు నాతోనే ఉంటారు. వారిలో ఒకటి నా తల్లి ప్రేమ.. రెండోది డాన్స్.. నాకు డాన్స్ అంటే పిచ్చి. ఖాళీ దొరికితే నేను డాన్స్ చేస్తూ ఉంటాను. ఈ రెండు ప్రేమలు నాకు చివరివరకు నాతోనే ఉంటాయి అని చెప్పుకొచ్చింది.