Urvashi Rautela: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఊర్వశీ రౌతేలా.. రెండు డ్రెస్సుల విలువ రూ.105 కోట్లు..
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు కళ్లు చెదిరే డ్రస్సులు ధరించి రెడ్ కార్పెట్ పై మెరిసిపోతుంటారు. ఈ వేడుకలలో ఎప్పటిలాగే హీరోయిన్ ఊర్వశీ రౌతేలా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. కేన్స్ వేదికగా ఖరీదైన డ్రస్సులలో మెరిసిపోయింది. అయితే ఇప్పుడు ఊర్వశీ ధరించిన రెండు డ్రస్సుల విలువ తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.