
టాలీవుడ్ హీరోయిన్ తమన్నా 15 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. 21 డిసెంబర్ 1989న ముంబైలో సంతోష్, రజనీ భాటియా దంపతులకు దన్మించింది. 2005లో షబా షమ్సీ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం చాంద్ సా రోషన్ సెహ్రాలో కథానాయికగా ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది.

ఈ సినిమా సమయంలో ఆమె వయసు కేవలం 15 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో తమన్నా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినిమాల్లోకి రావడానికి గల కారణాలను వివరించింది. పాఠశాలలో ఉన్నప్పుడు 13 సంవత్సరాల వయస్సు నుండి తనకు నటించాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చింది.

తాను సినిమాల్లోకి రావడానికి తన క్లాస్ టీచర్ కారణమని చెప్పుకొచ్చింది. తన మొదటి సినిమా ప్రారంభించడానికి తన గురువుగారు సహకరించారని తెలిపింది. తమన్నా 2006లో ‘కడి’ సినిమాతో తమిళంలో హీరోయిన్‌గా అడుగుపెట్టింది. రవికృష్ణ, నటి ఇలియానా కూడా ఈ చిత్రంలో నటించారు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. వరుస సినిమాల్లో నటించిన తమన్నా స్పెషల్ సాంగ్స్ సైతం చేసింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో కావలయ్యా అంటూ స్పెషల్ పాటతో అదరగొట్టేసింది. అలాగే హిందీలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో వెబ్ సిరీస్ చేసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.