
సందీప్ కిషన్ నటించిన బీరువా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది సురభి.

చక్కని లావణ్యంతో ఆకర్షించే చూపులతో కుర్రాళ్లను ఆకట్టుకుంది అందాల భామ సురభి.

ఈ అమ్మడు నటించింది కొన్ని సినిమాలే అయినా కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది.

తెలుగులో యంగ్ హీరో శర్వానంద్ సరసన 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమాలో నటించింది. ఆతర్వాత నాని నటించిన 'జెంటిల్ మెన్' సినిమాలో అలరించింది.

ఈ రెండు సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్న సురభికి తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి.

'ఒక్క క్షణం' .. 'ఓటర్' సినిమాలు మాత్రం పెద్దగా ఆడలేదు.

ఇటీవలే శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ఆకట్టుకోలేక పోయింది.

సురభి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ.