
కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసిన అతి కొద్ది కాలంలోనే వరుస అవకాశాలను అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంటుంది శ్రీలీల. తక్కువ సమయంలోనే అగ్రహీరోలందరితో నటించే అవకాశం దక్కించుకుంది.

అభినయంతోపాటు.. మంచి డాన్సింగ్ స్కిల్స్ ఉండటం ఆమెకు ఎంతగానో కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం స్టార్ హీరోస్ అందరి సినిమాల్లో నటిస్తోంది శ్రీలీల.

ఇటీవలే మాస్ మహరాజా రవితేజ సరనస ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్.. త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీ.. బాలయ్య, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న చిత్రాల్లో నటిస్తుంది.

ఇవే కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఓవైపు వెండితెరపై అలరిస్తూనే..మరోవైపు ఓటీటీలోకి అడుగుపెట్టింది శ్రీలీల.

విరాట్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఐ లవ్ యు ఇడియట్ చిత్రం ఇప్పుడు ఆహాలో ఆకట్టుకుంటుంది. ఇది కన్నడ సినిమాకు అనువాదం. అంటే ఆమె తొలి సినిమా ఇప్పుడే ఆడియన్స్ ముందుకు వచ్చింది.

అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీమతి బత్తుల వసంత సమర్పణలో ఎపి అర్జున్ దర్శకత్వంలో సాయి కిరణ్ బత్తుల, సుదర్శన్ గౌడ్ బత్తుల, ఎపి అర్జున్ నిర్మాతలుగా ఈ సినిమా వచ్చింది.

ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలోనూ అందరినీ మెప్పిస్తోంది. ఆహాలో ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

ఓటీటీలో అదరగొట్టేస్తోన్న శ్రీలీల 'ఐ లవ్ యు ఇడియట్'..