Basha Shek |
Jun 08, 2023 | 8:23 AM
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలి సెగల్ తన చిరకాల ప్రియుడు ఆశిష్ సజ్నానీని వివాహం చేసుకుంది. వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు తెగ వైరల్‌గా మారాయి.
కార్తీక్ ఆర్యన్ చిత్రం ప్యార్ కా పంచ్‌నామాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సోనాలి బుధవారం (జూన్ 7) వ్యాపారవేత్త ఆశిష్ సజ్నానీతో కలిసి ఏడడుగులు నడిచింది.
ఆశిష్, సోనాలి దాదాపు 5-6 ఏళ్లుగా ఒకరికొకరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇప్పుడు పెళ్లిపీటలెక్కి తమ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకున్నారు.
గురుద్వారాలో ఆశిష్, సోనాలి వివాహం జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.
తన పెళ్లిఫొటోలను సోనాలి స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లి వేడుకల్లో సోనాలి గులాబీ రంగు చీరలో కనిపించగా, ఆశిష్ తెల్లటి షేర్వాణీలో ముస్తాబయ్యాడు.