ప్రతినిధి సినిమాలో నారా రోహిత్‌తో కలిసి నటించిన హీరోయిన్ శుభ్ర అయ్యప్ప జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. బెంగళూరుకు చెందిన బిజినెస్‌మెన్ విశాల్ శివప్పతో కలిసి ఏడడుగులు నడిచింది.
కొడగులోని150 ఏళ్ల చరిత్ర ఉన్న తన ఇంట్లో ఈ పెళ్లి వేడుక జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.
అనంతరం తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శుభ్ర. సంయుక్త హెగ్డే, శాన్వి శ్రీవాత్సవ, ప్రణీత, మహత్ రాఘవేంద్ర తదితర సెలబ్రిటీలతో పాటు నెటిజన్నలు నూతన దంపతులకు అభినందనలు తెలిపారు.
శుభ్రా మొదట మోడలింగ్ ను కెరీర్‌గా ఎంచుకుంది. ఆతర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రతినిధి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత సగపాతంతో తమిళ్‌లో అడుగు పెట్టింది. అదే ఏడాది వజ్రకాయతో కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రస్తుతం ఆమె నటించిన రామన అవతార రిలీజ్‌కు రెడీగా ఉంది. అయితే పెళ్లయ్యాక శుభ్ర సినిమాల్లో నటిస్తుందో లేదో అనేది క్లారిటీ లేదు.