
ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలు గొందింది అందాల తార శ్రియ. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రియ పెళ్లి తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది.

హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉండగానే 2018లో రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్ ను వివాహం చేసుకుంది శ్రియా శరన్.

2021 జనవరి 10న శ్రియకు అమ్మాయి పుట్టింది. అయితే ఈ విషయాన్ని చాలా రోజులు గోప్యంగానే ఉంచారు శ్రియా దంపతులు. బిడ్డ పుట్టిన 10 నెలల తర్వాత అంటే 2021 అక్టోబర్ లో తమ కూతురిని ప్రపంచానికి పరిచయం చేశారు.

ఆర్ ఆర్ ఆర్ మూవీలో శ్రియ అజయ్ దేవ్ గణ్ భార్యగా తళుక్కున మెరిసింది.ఆ తర్వాత దృశ్యం 2 (హిందీ) తో పాటు మరికొన్ని సినిమాల్లో కనిపించిందీ అందాల తార.

ప్రస్తుతం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నట్లుంది శ్రియా శరన్. అందుకే హిందీలో ఒకటి, రెండు సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. తెలుగుతో పాటు దక్షిణాది సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ కనిపించి చాలా రోజులైంది.