- Telugu News Photo Gallery Cinema photos Ctress Shilpa shetty visits uttar pradesh mathura vrindavan banke bihari temple for darshan, Photos goes viral
Shilpa Shetty: మథుర బాంకీ బిహారీ ఆలయాన్ని దర్శించుకున్న శిల్పాశెట్టి.. రాధే రాధే అంటూ..
Shilpa Shetty: ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం మథురలో పర్యటించారు. అక్కడి ప్రఖ్యాత బాంకీ బిహారీ ఆలయాన్ని సందర్శించారు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Updated on: Jul 30, 2022 | 6:38 PM

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం మథురలో పర్యటించారు. అక్కడి ప్రఖ్యాత బాంకీ బిహారీ ఆలయాన్ని సందర్శించారు.

కాగా శిల్పాశెట్టి భద్రత కోసం పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆమెను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

ఆలయాన్ని ఆలయాన్ని సందర్శించిన తర్వాత దేవుడి ఆశీస్సులు తీసుకున్నారు శిల్పాశెట్టి. నిండు భక్తితో పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ పూజారులు శిల్పాశెట్టికి పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు. దేవస్థానం నియమాల ప్రకారం దర్శన ఏర్పాట్లు చేశారు.

కాగా తనను చూసేందుకు వచ్చిన అభిమానులను చూసి శిల్ప పరవశించిపోయింది. రాధే-రాధే అంటూ అందరినీ పలకరించింది.

శిల్పాశెట్టితో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.

కాగా శిల్పాశెట్టి బృందావన్‌లోని ఇతర ఆలయాలను కూడా దర్శించుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

రాధా-కృష్ణుల ప్రేమకు ప్రతీకగా నిలిచే మథురను మొదటిసారి చూసేందుకు వచ్చిన శిల్పా.. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేసింది.




