
శిల్పాశెట్టి... సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తుంది.

ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తూ జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. యాభై ఏళ్లు దాటినప్పటికీ ఇప్పటికీ స్లిమ్ గా , ఆరోగ్యంగా కనిపించడం వెనకున్న రహస్యాన్ని వెల్లడించింది.

తన లుక్, ఫిట్నెస్ కు కారణంగా ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని తెలిపింది. బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ మానేస్తారని.. కానీ తాను మాత్రం ఆ తప్పు అస్సలు చేయనని తెలిపారు. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగడంతో తన డే మొదలవుతుందని తెలిపారు.

ఆ తర్వాత కాసేపటికి నాలుగు చుక్కల నోనీ జ్యూస్ తీసుకుంటానని చెప్పారు. ఆపై టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ తప్పనిసరి అని వివరించారు. బ్రేక్ ఫాస్ట్ లో సీజనల్ ఫ్రూట్స్, బాదం పాలు, మ్యూజ్లీ, ఉడికించిన గుడ్లు తీసుకుంటానని అన్నారు.

మధ్యాహ్న భోజనంలో నెయ్యి తప్పనిసరిగా ఉంటుందని.. అయితే తాను పాటించే ఆహార అలవాట్లు అందరికీ సరిపడకపోవచ్చని అన్నారు. వైద్యుల సలహతోనే డైట్, ఫిట్నెస్ ఫాలో కావాలని అన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శిల్పా శెట్టి చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.