బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో సారా అలీ ఖాన్ ఒకరు. సైఫ్ అలీ ఖాన్ నటవారసురాలిగా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
తాజాగా తనకు ఆషికీ 3 చిత్రంలో నటించాలని ఉందంటూ మనసులోని కోరికను బయటపెట్టింది. ఆషికీ ఫ్రాంచైజీ తన మూడవ చిత్రాన్ని ఇటీవల రూపొందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇందులో కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించనున్నారు. ఈ చిత్రంలో తనకు నటించాలని ఉందని కోరికను బయటపెట్టింది. సారా, కార్తీక్ ఆర్యన్ 2020లో లవ్ ఈజ్ కల్ చిత్రంలో నటించారు.
ఆ సమయంలో వారిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కానీ సినిమా విడుదలకు ముందే వీరికి బ్రేకప్ జరిగినట్లుగా వార్తలు వినిపించాయి.
తనకు ఆషికీ 3 ఆఫర్ రాలేదని.. కానీ ఛాన్స్ ఆ సినిమాలో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. దీంతో మరోసారి ఈ ప్రేమ పక్షులు కలిసి నటించాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
సినిమాలో నటించాలని ఉందంటున్న బాలీవుడ్ హీరోయిన్.. సారా మనసులో ఉన్న ఆ హీరో ఎవరంటే..
సినిమాలో నటించాలని ఉందంటున్న బాలీవుడ్ హీరోయిన్.. సారా మనసులో ఉన్న ఆ హీరో ఎవరంటే..