Samyuktha: టాలీవుడ్లో సంయుక్త జోరు.. నిర్మాతగా మారిన మాలయాళీ కుట్టి..
భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కేరళ బ్యూటీ సంయుక్త మీనన్. ఆ సినిమాలో హీరోయిన్ కాకపోయిన తనదైన నటనతో మెప్పించింది. తొలి చిత్రానికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాలతో సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు గోల్డోన్ బ్యూటీ, లక్కీ గర్ల్ అంటూ పేర్లు సొంతం చేసుకుంది.