Samyuktha: క్రేజీ ఆఫర్ అందుకున్న సంయుక్త.. ‘దియా’గా మారిన అందాల తార..

|

Sep 11, 2024 | 4:54 PM

భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్. మొదటి సినిమాతోనే అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకుంటూ గోల్డెన్ బ్యూటీగా ట్యాగ్ సొంతం చేసుకుంది. బింబిసార, సార్ వంటి చిత్రాలతో అలరించిన సంయుక్తకు.. తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

1 / 5
భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్. మొదటి సినిమాతోనే అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస హిట్స్ అందుకుంటూ గోల్డెన్ బ్యూటీగా ట్యాగ్ సొంతం చేసుకుంది.

2 / 5
బింబిసార, సార్ వంటి చిత్రాలతో అలరించిన సంయుక్తకు.. తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒకే ప్రాజెక్ట్ ఉంది. యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న స్వయంభు చిత్రంలో కనిపించనుంది.

3 / 5
తాజాగా మరో క్రేజీ ఛాన్స్ అందుకుంది ఈ బ్యూటీ. స్టార్ హీరో శర్వానంద్ 37వ సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

4 / 5
ఈ చిత్రంలో శర్వానంద్ సరసన ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారు. సాక్షివైద్యతోపాటు సంయుక్త కూడా ఇందులో కథానాయికగా అలరించనుంది. తాజాగా సంయుక్త పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పాత్రకు సంబంధించి దియా అనే పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు.

5 / 5
ఆ పోస్టర్ లో సంయుక్త సంప్రదాయ నృత్య దుస్తుల్లో.. చేతులలో రెండు దీపాలతో అద్భుతమైన నర్తన శైలిని చూపిస్తూ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆమె చేతిలో ఉన్న దీపాల కాంతిలో ఆమె అందం మరింత వెలుగుతుండడంతో ఆమెకు పాత్రపై మరింత ఆసక్తి నెలకొంది.