
హీరోయిన్ అంటే గ్లామర్ డాల్ అనుకుంటున్న టైమ్‌లో నటిగా తన కంటూ స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న బ్యూటీ సాయి పల్లవి.

పాత్రల ఎంపిక విషయంలో సాయి పల్లవి స్ట్రాటజీ వెండితెర మీద కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసింది.

అందుకే హీరోల రేంజ్‌లో తన కంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు ఈ నేచురల్ బ్యూటీ.

ఇంత క్రేజ్ ఉన్న సాయి పల్లవి సడన్‌గా వెండితెర నుంచి బ్రేక్ తీసుకున్నారు. విరాటపర్వం సినిమా తరువాత ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వలేదు.

డిజిటల్ రిలీజ్ అయిన గార్గి సాయి పల్లవి నటించిన లాస్ట్ మూవీ. ఈ సినిమాకు మంచి అప్లాజ్ వచ్చినా... తరువాత మరో సినిమా కమిట్ అవ్వలేదు టాలెంటెడ్ బ్యూటీ.

ఆ మధ్య సాయి పల్లవి బాలీవుడ్ ప్రయత్నాల్లో ఉన్నారన్న ప్రచారం జరిగింది. అందుకే సౌత్ సినిమాలకు అంగీకరించట్లేదని ఫిక్స్ అయ్యారు సౌత్ ఆడియన్స్.

సాయి పల్లవి కూడా కోవిడ్ బ్రేక్‌లో బాలీవుడ్ స్క్రిప్ట్స్ విన్నానని చెప్పటంతో, బాలీవుడ్ ఎంట్రీ పక్కా అన్న ప్రచారం జరిగింది. కానీ ఆ విషయంలోనూ సైలెన్సే మెయిన్‌టైన్ చేస్తున్నారు సాయి పల్లవి.

కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్న టైమ్‌లో సాయి పల్లవి ఇలా సడన్‌గా బ్రేక్ తీసుకోవటంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

తమ ఫేవరెట్ హీరోయిన్‌ను మళ్లీ తెర మీద చూసేది ఎప్పుడా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.