
గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది హీరోయిన్ రితిక సింగ్. తొలి చిత్రానికి నేషనల్ అవార్డ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు.

ఆ తర్వాత తెలుగులో నీవెవ్వరో సినిమాలో నటించింది. ఆ తర్వాత చాలా రోజుల వరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఇటీవలే కింగ్ ఆఫ్ కోత సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

కాల పక్కారా అంటూ సాగే ఐటమ్ పాటతో అభిమానులను అలరించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోన్న ఎప్పటికప్పుడు ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ జిమ్ పిక్స్ షేర్ చేసింది. జిమ్ లో సాధన చేసిన తర్వాత ఫోటోలను తన ఇన్ స్టాలో పంచుకుంది. ప్రస్తుతం రితిక ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

తాజాగా ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం రితిక లేటేస్ట్ ఫోటోస్ పై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.