Shiva Prajapati |
Feb 23, 2023 | 12:34 PM
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమై.. అనతి కాలంలో టాప్ స్టార్‌గా ఎదిగింది అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా.
తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న ఈ హైదరాబాద్ బ్యూటీ తమిళ చిత్ర పరిశ్రమలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇమైక్కా నొడిగళ్ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత అడంగామరు, అయోగ్యా, సంఘ తమిళన్, సర్ధార్, తిరుచిట్రం ఫలం వంటి చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు.
ఇక తెలుగులోనూ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ అమ్మడు.. బాలీవుడ్‌లో యోధ అనే చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఆర్బీఐ ఆఫీసర్ 'మేఘా' పాత్రలో వెబ్ సిరీస్‌లోనూ నటించిన రాశీఖన్నాకు మంచి గుర్తింపు వస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో సిన్సియర్, డి-గ్లామ్ ఆఫీసర్‌గా కనిపించి మెప్పించింది.
రాశీఖన్నా సోషల్ మీడియాలో బోల్డ్, సిజ్లింగ్ ఫోటోలు షేర్ చేసింది. చాక్లెట్ కలర్ డ్రెస్ ధరించి అదరహో అనిపిస్తోంది.