Raashi Khanna: ఇంతగా మారిపోయావేంటమ్మాయ్.. ఆ చెక్కిళ్ల అందం ఎక్కడమ్మా రాశీ..
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీ ఖాన్నా. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యింది. టాలీవుడ్ లో దాదాపు అందరు హీరోలతో నటించింది ఈ బ్యూటీ. కానీ ఇప్పటివరకు స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయింది. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఈబ్యూటీకి కొంతకాలంగా అవకాశాలు కరువయ్యాయి. ఎప్పుడో ఒకటి రెండు సినిమాలతో మెప్పించినప్పటికీ సరైన హిట్ మాత్రం రాశీ ఖాతాలో పడడం లేదు. చాలా రోజులుగా రాశీ సినిమాల్లో కనిపించలేదు.