
జనవరి 13న ప్రారంభమైన అట్టహాసంగా ప్రారంభమైన ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా బుధవారం తో ముగిసింది.

ఈ 45 రోజుల్లో సుమారు 60 కోట్లకు పైగా మంది భక్తులు మహా కుంభమేళాలో స్నానమాచరించారని యూపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

ఇక ఆఖరి రోజు, అలాగే మహా శివరాత్రి పర్వదినం కావడంతో బుధవారం (ఫిబ్రవరి 26) మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు.

ఈ క్రమంలో ప్రముఖ హీరోయిన్ రాయ్ లక్ష్మి మహా కుంభమేళాను దర్శించుకుంది. అక్కడి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించింది.

అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ అందాల తార. మహా శివరాత్రి రోజున మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించే అవకాశం లభించిందని పేర్కొంది.