Rajeev Rayala |
Oct 19, 2022 | 5:56 PM
ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార ప్రియమణి. యమదొంగ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ వరుస ఆఫర్లను సొంతం చేసుకొని తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది
ఇక వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇస్తూ వచ్చిన ప్రియమణి తాజాగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌లో నటించి మళ్లీ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ప్రియమణి
ప్రియమణి తాజాగా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. ప్రియమణి తాజాగా నటిస్తోన్న చిత్రం DR56. కన్నడలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మయాళంలో ఒకకాలంలో విడుదల చేయనున్నారు
తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాలో ప్రియమణి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కోలీవడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. బ్లాక్ అండ్ వైట్ సూట్‌లో ప్రియమణి సీరియస్ లుక్‌లో కనిపిస్తోంది.
భామ కలాపం తర్వాత ప్రియమణి మరో హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా విజయవంతమైతే ప్రియమణికి మరిన్ని అవకాశాలు క్యూ కడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదిలా ఉంటే ప్రియమణి ఈ సినిమాతో పాటు.. సైనైడ్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ప్రారంభకానుంది.