Laapataa Ladies- Pratibha Ranta: మా ఆశలు నిజమయ్యాయి.. కష్టానికి ఫలితం దక్కింది.. ‘లపతా లేడీస్’ హీరోయిన్..
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వం వహించిన లాపతా లేడీస్ మూవీ 2025 ఆస్కార్ అవార్డులకు మన దేశం నుంచి అధికారికంగా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మూవీ టీంకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ మూవీలో కీలకపాత్ర పోషించిన నటి ప్రతిభారత్న ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో ఆమె పుష్పా రాణిగా మెప్పించారు.