టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ ప్రణీత సుభాష్ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. తాను మరోసారి అమ్మను కాబోతున్నట్లు ప్రకటించింది. 'రౌండ్ 2... ఇక నుంచి ప్యాంట్‌లు సరిపోవు' అంటూ చమత్కారంగా తాను అమ్మవుతోన్న శుభవార్తను పంచుకుంది. అలాగే బేబీ బంప్ తో ఉన్న తన ఫొటోలను కూడా షేర్ చేసింది.