Poonam Kaur: సమంత లానే అరుదైన వ్యాధితో బాధపడుతున్న అంటుంది ఈ అమ్మడు పూనమ్‌ కౌర్‌..

|

Dec 01, 2022 | 6:44 PM

నటించింది కొన్ని సినిమాలే అయినా తన అందం, అభినయంతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పూనమ్‌కౌర్‌. ఎస్వీ కృష్ణారెడ్డి, శ్రీకాంత్‌ కాంబినేషన్‌లో వచ్చిన మాయాజాలం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ సొగసరి

1 / 8
మొన్న సమంత.. నిన్న కల్పిక..తాజాగా పూనమ్‌ కౌర్‌.. తమకున్న అనారోగ్య సమస్యలు, జబ్బులను ధైర్యంగా బయటపెట్టి అవగాహన కల్పిస్తున్నా అందాల తారల జాబితా ఇది.

2 / 8
మయోసైటిస్‌ అనే అరుదైన జబ్బుతో బాధపడుతున్నట్లు ప్రముఖ నటి సమంత ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే.

3 / 8
ఆతర్వాత కల్పికా గణేష్‌ కూడా ఇదే సమస్యతో సతమతమవుతున్నట్లు తెలిపింది. తాజాగా ప్రముఖ నటి పూనమ్‌ కౌర్‌ తన అభిమానులకు ఓ షాకింగ్‌ విషయం చెప్పింది.

4 / 8
చేసిందే కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఫైబ్రో మైయాల్జియా అనే ఓ అరుదైన జబ్బుతో బాధపడుతోందట.

5 / 8
సుమారు రెండేళ్లుగా ఈ సమస్యతో సతమతమవుతోన్న పూనమ్ ప్రస్తుతం దీనిక కోసం కేరళలో చికిత్స తీసుకుంటోందట. తాజాగా తన ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

6 / 8
ఫైబ్రో మైయాల్జియా కారణంగా అలసట, నిద్ర, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మానసిక స్థితిలో సమస్యలు, కండరాల నొప్పి సహా పలు ఇబ్బందులు పడుతోందట పూనమ్‌. ఈ వ్యాధి నయం కావడానికి కేరళలోని ఆయుర్వేద నిపుణులు ఆమెకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారట.

7 / 8
మొదట తన జబ్బుకు చికిత్స కోసం పలు ఆస్పత్రులు తిరిగిందట పూనమ్‌. అయితే నయం కాకపోవడంతో కేరళ ఆయుర్వేద వైద్యులను సంప్రదించిందట. వారు ఆమెను పరిశీలించి ఫైబ్రో మైయాల్జియా అనే అరుదైన జబ్బు ఉన్నట్లు తేల్చారట.

8 / 8
ప్రస్తుతం కేరళలోనే ఉంటూ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోందామె. అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్సర్ సైజ్, టాకింగ్ థెరఫీ కూడా తీసుకుంటోందట. ప్రస్తుతం ఈ చికిత్స మెరుగైన ఫలితాలను అందిస్తోందని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని పూనమ్‌ ఆశాభావం వ్యక్తం చేస్తోందట.