
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలతో థియేటర్లలో సందడి చేసిన ఈ అమ్మడు ఇప్పుడు వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా షూటింగ్లో గడిపేస్తుంది.

రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలతో ప్రేక్షకులను ఆలరించింది హీరోయిన్ పూజా హెగ్డే.

ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ కాంబోలో రాబోతున్న సినిమాలోనూ హీరోయిన్గా ఎంపికైంది. ఇంకా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకాలేదు.

తెలుగుతోపాటు.. తమిళంలోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్న ఈ అమ్మడు.. తాజాగా మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

గత కొద్ది రోజులుగా పూజా హెగ్డే.. మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో రాబోతున్న జనగణమన సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ జనగణమన సినిమాలో హీరోయిన్ పూజ అని ప్రకటించారు చిత్రయూనిట్. పూజ హెగ్డేను వెల్కమ్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు పూరి.

ఈ వీడియోలో మూవీ మేకింగ్ చూపిస్తూనే ఛార్మి , పూరి కలిసి పూజాహెగ్డే కు వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలు పెట్టనున్నారు.

అక్కడ విజయ్, పూజా పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వనుంది టీమ్.

ఈ సినిమాను పూరి కనెక్ట్ మరియు శ్రీకర స్డూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలాగే ఛార్మి కౌర్ – దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో 2023 ఆగస్టు 3న ఈ సినిమాని గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా బుట్టబొమ్మ.. విజయ్ సినిమా షూటింగ్లో జాయిన్ అయిన పూజా..