Srilakshmi C |
Jul 25, 2023 | 7:47 AM
యంగ్ హీరోయిన్ నూరిన్ షరీఫ్, ప్రియుడు ఫహిమ్ సఫర్ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సహ నటుడైన ఫహిమ్ సఫర్‌ను నటి నూరిన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. తిరువనంతపురంలో సోమవారం వీరి నిఖా జరిగింది.
గతేడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఈ బ్యూటీ స్వయంగా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
ప్రస్తుతం వీరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటి ప్రియా ప్రకాశ్ వారియర్ 'లవర్స్ డే' (మలయాళంలో 'ఒరు అదార్ లవ్') అనే సినిమాతో నూరిన్ షరీఫ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ నూరిన్ షరీఫ్ అయినప్పటికీ ఈమెకు పెద్దగా క్రేజ్ రాలేదు.
దీంతో మలయాళంలోనే నటిగా స్థిరపడిపోయింది. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన నూరిన్ షరీఫ్ 'చంక్జ్' మువీతో నటిగా అరంగెట్రం చేసింది. ఆ తర్వాత ఒరు అదార్ లవ్, శాంతాక్రూజ్, వెళ్లప్పం, బర్ముడా, ఆన్ ద అదర్ హ్యాండ్ వంటి సినిమాల్లో నటించింది.
ఓ సినిమాకు పనిచేస్తున్న క్రమంలో యాక్టర్ కమ్ రైటర్ అయిన ఫహిమ్ సఫర్, నూరిన్ షరీప్ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఫ్రెండ్స్ అవ్వడం ప్రేమలో పడటం, నిశ్చితార్ధం, పెళ్లి అంతా చకచకా జరిగిపోయింది.