AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nabha Natesh: ఆ సినిమాతో కెరీర్ పీక్స్.. కానీ ఒక్క ఘటనతో నా జీవితమే మారిపోయింది.. నభా నటేష్..

ప్రస్తుతం హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ ఫాంలో ఉన్న హీరోయిన్ నభా నటేష్. ఇటీవల ఓ ఇంటర్వ్యూ తన కెరీర్‌లో రెండేళ్ల సుదీర్ఘ విరామం గురించి వివరించారు. మెట్లపై నుంచి జారిపడి భుజం ఎముకలు విరిగిపోవడంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఈ గాయం నుండి కోలుకోవడానికి సమయం పట్టిందని, అది తనను వ్యక్తిగతంగా మరింత బలోపేతం చేసిందని నభా పేర్కొన్నారు. నాగబంధం వంటి చిత్రాలతో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆమె వెల్లడించారు.

Rajitha Chanti
|

Updated on: Jul 03, 2026 | 1:34 PM

Share
హీరోయిన్ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కానీ అదే సమయంలో అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యింది. తాజాగా నభా నటేష్ తన కెరీర్‌లో ఎదురైన సవాళ్లు, ముఖ్యంగా రెండేళ్ల సుదీర్ఘ విరామం గురించి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆమె వివరించారు.

1 / 5
2015లో కన్నడ చిత్రంతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించిన నభా నటేష్, ఆ తర్వాత తెలుగులో నన్ను దోచుకుందువటే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇస్మార్ట్ శంకర్, వజ్రకాయ వంటి చిత్రాలతో మాస్, యూత్, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన కెరీర్ పట్ల ఎప్పుడూ ఒక భిన్నమైన ఆలోచనతో ఉంటానని నభా తెలిపారు. సినిమా అంటే కేవలం వృత్తి కాదని, అది తనకొక సృజనాత్మక, ఆధ్యాత్మిక అనుభూతి అని ఆమె అన్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటం అంటే తనకి చాలా ఇష్టమని, అందుకే నటిగా ప్రతి సినిమాలో కొత్త అనుభవం కోరుకుంటానని పేర్కొన్నారు.

2 / 5
ర్యాట్ రేస్ లో భాగంగా సినిమాలు చేయకుండా, తనకు ఆనందం, సంతృప్తినిచ్చే పాత్రల కోసం ఎదురు చూస్తానని నభా వెల్లడించారు. ఈ మధ్యకాలంలో రెండేళ్ల పాటు సినిమాల నుంచి దూరంగా ఉండాల్సి వచ్చిందని, అందుకు గల కారణాన్ని వివరిస్తూ, "నేను మెట్లపై నుంచి జారిపడ్డాను. తలకి దెబ్బ తగలకుండా చూసుకునే ప్రయత్నంలో, నా శరీర బరువు మొత్తం ఎడమ భుజంపై పడింది. లోపల ఉన్న ఎముకలు చిన్న చిన్న ముక్కలైపోయాయి. అప్పుడు నేను ఫ్రాక్చర్ అనుకున్నాను, కానీ సర్జరీ చేయాల్సి వచ్చింది. స్టీల్ రాడ్ , అనేక స్క్రూలు పెట్టారు," అని వివరించారు. ఈ సంఘటన తనను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా ప్రభావితం చేసిందని, ఆ సమయంలో దాదాపు 4-5 సినిమాలు చేస్తున్నానని ఆమె తెలిపారు.

3 / 5
గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవడం, బెడ్ రెస్ట్, ఫిజియోథెరపీ వల్ల తన సాధారణ జీవితంపై ప్రభావం పడిందని, ఈ పరిమితులు తనకు మానసిక ఒత్తిడిని కలిగించాయని నభా అన్నారు. అయితే, ఈ సమయాన్ని తనను తాను పునర్నిర్మించుకోవడానికి ఉపయోగించుకున్నానని ఆమె వెల్లడించారు. ఈ విరామంలో నభా పెయింటింగ్ చేయడం, డ్యాన్స్ చేయడం, పాడటం, స్కల్ప్చర్స్ చేయడం, పుస్తకాలు చదవడం, ప్రయాణించడం వంటి పనులు చేశారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడుపుతూ, తన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందించుకున్నారు. ఈ అనుభవం తర్వాత, తను మునుపటి కంటే మరింత దృఢంగా మారానని నభా తెలిపారు.

4 / 5
"ఈ రేస్ నాకోసం కాదు. నేను నా జీవితాన్ని ఆస్వాదించాలని, అందమైన చిత్రాలు చేయాలని, గొప్ప కథల్లో భాగం కావాలని కోరుకుంటున్నాను," అని నభా స్పష్టం చేశారు. ఈ ఆలోచనతోనే ప్రస్తుతం తాను నాగబంధం, స్వయంభూ వంటి విభిన్న ప్రాజెక్ట్‌లను ఎంచుకున్నానని ఆమె తెలిపారు. నభా నటేష్ వ్యక్తిగత ఎదుగుదల, కళ పట్ల ఆమెకున్న అంకితభావం, ప్రతికూలతలను అధిగమించి బలమైన పునరాగమనం చేయడానికి ఆమె సిద్ధంగా ఉన్న తీరు ప్రశంసనీయం అని అంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది నభా నటేష్.

5 / 5
Follow Us
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి

భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..

60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..

స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?

జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..

భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్

కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం

మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు

గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస