
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం చిత్రంతో తెలుగు తెరకు పరిచమైంది మృణాల్ ఠాకూర్. సీతగా మొదటి సినిమాతోనే కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమాలో మృణాల్ క్యూట్ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం వచ్చాయి. ఈ క్రేజ్‌తోనే బాలీవుడ్‌త పాటు దక్షిణాది సినిమాల్లో వరుసగా సినిమాలు చేస్తోందీ అందాల తార.

ప్రస్తుతం తెలుగులో హాయ్ నాన్న అనే సినిమాలో నటిస్తోంది మృణాళ్. ఇందులో న్యాచురల్ స్టా్‌ర్ నాని హీరోగా నటిస్తున్నాడు. అలాగే విజయ్ దేవరకొండతో కలిసి మరో ప్రాజెక్టులో నటిస్తోందీ ముద్దుగుమ్మ. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఈ సంక్రాంతికి విజయ్ దేవరకొండతో కలిసి మృణాళ్ నటించిన సినిమా రిలీజ్ కాబోతుంది. అంతకు ముందే హాయ్ నాన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండింటితో పాటు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా మృణాళ్ చాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే సినిమాలతో పాటు అప్పుడప్పుడూ లవ్, రిలేషన్‌షిప్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తోంది మృణాళ్. ఈ క్రమంలో ప్రేమ గురించి సీతారామం బ్యూటీ చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.

హాలీవుడ్ స్టార్ హీరో కీను రీవ్స్ అంటే తనకు చాలా ఇష్టమని, చిన్నతనంలోనే అతనిని చూసి ప్రేమలో పడ్డానని మృణాళ్ చెప్పుకొచ్చింది. అయితే తనది వన్‌సైడ్ లవ్ మాత్రమేనంది ముద్దుగుమ్మ. కీను రీవ్స్ లాంటి వ్యక్తి తన జీవిత భాగస్వామిగా వస్తే చాలా హ్యాఫీగా ఫీలవుతానంటోందీ ముద్దుగుమ్మ.