
ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్ మృణాళిని రవి లేటేస్ట్ బ్యూటీఫుల్ ఫోటోస్ వైరలవుతున్నాయి. అందులో బ్లాక్ శారీలో మరింత అందంగా కనిపిస్తోంది మృణాళిని.

1995 మే 10న తమిళనాడులో జన్మించింది మృణాళిని రవి. 2019లో సూపర్ డీలక్స్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

అంతుకు ముందు సోషల్ మీడియాలో డమ్ స్మాష్ వీడియోస్ చేస్తూ ఉండేది. ఆ వీడియోస్ చూసిన త్యాగరాజన్ కుమార్ ఆమెకు సూపర్ డీలక్స్ సినిమాలో నటించే అవకాశం కల్పించాడు.

తెలుగులో గద్దలకొండ గణేష్ సినిమాలో నటించింది. ఈ సినిమాతో నటిగా మంచి మార్కులే కొట్టేసిన ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేదు.

తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది మృణాళిని . తాజాగా మృణాళిని షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఈ స్టిల్స్ ఏదో సినిమాకు సంబంధించినవి అని తెలుస్తోంది.