Manjima Mohan : ‘కామెంట్‌ చేసే ముందు ఒకసారి ఆలోచించండి’.. బాడీషేమింగ్ పై సీరియస్ అయిన హీరోయిన్

|

May 03, 2022 | 1:18 PM

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నటి మంజిమా మోహన్‌.

1 / 7
  అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది నటి మంజిమా మోహన్‌(Manjima Mohan).

2 / 7
 చైతూ ప్రియురాలిగా ఆమె పోషించిన లీలా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ నారా భువనేశ్వరీ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

3 / 7
కొన్నిరోజుల క్రితం విష్ణు విశాల్‌ ఎఫ్‌ఐఆర్‌ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది.

4 / 7
  ఆ మధ్యన కోలీవుడ్‌ స్టార్‌ గౌతమ్ కార్తిక్ (Gautham Karthik)తో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పుకార్లు రావడం, వాటిని ఆమె ఖండించడంతో వార్తల్లో నిలిచిందీ ముద్దుగుమ్మ

5 / 7
 ప్రస్తుతం తన దృష్టంతా సినిమాల ఉందని స్పష్టం చేసింది. కాగా మలయాళంలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న మంజిమా ప్రస్తుతం తలైవి డైరెక్టర్‌ ఏ.ఎల్‌.విజయ్‌ తెరకెక్కించే ఓ చిత్రంలో నటిస్తోంది.

6 / 7
 ఈక్రమంలో తన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసినప్పుడు కొందరు నెటిజన్లు తన శరీరాకృతిపై కామెంట్లు చేస్తున్నారు

7 / 7
 ప్రతి ఒక్కరూ హెల్దీగా, ఫిట్‌గా ఉండాలనే అనుకుంటారు. అయితే కొందరు సహజసిద్ధంగానే లావుగా ఉంటారు. ఈ విషయంలో వారిని ఏ మాత్రం తప్పుపట్టలేం. అందువల్ల దయచేసి ఒకరి శరీరాకృతిపై కామెంట్‌ చేసే ముందు ఒకసారి ఆలోచించండి. అలాంటి కామెంట్లు చేయడం వల్ల బొద్దుగా ఉన్నవారు స్లిమ్‌గా మారిపోతారా? పైగా ఇలాంటి నెగెటివ్‌ కామెంట్ల వల్ల వారిలోని ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది.. అంటూ చెప్పుకొచ్చింది.