
1. గతంతో పోలిస్తే మంచు లక్ష్మీ ఇప్పుడు అడపా దడపా మాత్రమే సినిమాల్లో నటిస్తోంది. సుమారు ఐదేళ్ల తర్వాత దక్ష: ఏ డెడ్లీ కాన్స్పిరసీ' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చిందీ అందాల తార.

గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. మోహన్ బాబు కూడా ఈ మూవీలో ఓ ప్రధాన పాత్రలో కనిపించడం విశేషం.

కాగా ఈ సినిమా రిలీజ్ తర్వాత షూటింగుల నుంచి కాస్త విరామం తీసుకుంది మంచు లక్ష్మి. ఎంచెక్కా ఐస్ ల్యాండ్ దేశానికి వెకేషన్ కు వెళ్లింది. అక్కడ ఎంచెక్కా మంచులో సాహసాలు చేస్తూ ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తోంది.

తన వెకేషన్ కు సంబంధించి ఎప్పటికప్పుడు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది మంచు లక్ష్మి. అలా తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ మధ్యన తన సేవా కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది మంచు వారమ్మాయి. టీజ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించిన ఆమె పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని డెవలప్ చేస్తోంది.

ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకుని డెవలప్ చేస్తోంది మంచు లక్ష్మి. అలాగే కర్ణాటక, తమిళనాడులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తోంది మంచువారమ్మాయి.