
అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోయిన్ మాళవిక మోహనన్. 2013లో బట్టం బోలే సినిమాతో మలయాళీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు.

ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన పేట చిత్రంలో కనిపించింది. ఈ మూవీతో తమిళం ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది. ధనుష్, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన మాళవిక.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుంది. తెలుగులో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుంది.

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రం తర్వాత మాళవిక టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తుందేమో చూడాలి.

మాళవిక చివరిసారిగా తంగళాన్ చిత్రంలో నటించింది. చియాన్ విక్రమ్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. అలాగే సిద్ధాంత్ చతుర్వేది సరసన హిందీ యాక్షన్ చిత్రం ‘యుద్ర’లో కూడా నటించింది. సోషల్ మీడియాలో తాజగా అందమైన ఫోటోలు షేర్ చేసింది మాళవిక