
హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇన్నాళ్లు తమిళం, మలయాళం భాషలలో వరుస సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

అయితే ఓ సినిమా కోసం మాళవిక కేవలం రెండు వారాల్లోనే 8 కిలోల బరువు పెరిగిందట. అంతకు ముందు 14 రోజుల్లోనే బరువు తగ్గింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక.. తన ఫిట్నెస్ సిక్రెట్ రివీల్ చేసింది. ఒక సినిమాలో తన పాత్ర కోసం కేవలం 14 రోజుల్లోనే 8 కిలోల బరువు తగ్గిందట. అది తనకు చాలా కష్టమైన దశ అని చెప్పుకొచ్చింది.

తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకున్నానని.. అదే సమయంలో శారీరకంగా చాలా కష్టపడి స్టంట్స్, యాక్షన్ సీన్ రిహార్సల్స్ చేయడం శరీరంపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి తెలిపింది. శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యం, కాబట్టి కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేశానని అది చాలా ప్రమాదకరమైనది అని తెలిపింది.

ఆ డైట్ ప్లాన్ శరీరంపై దుష్ర్పభావాలను కలిగిస్తుందని.. శక్తిలేకపోవడంతో చాలాసార్లు బలహీనంగా అనిపించిందని.. డాక్టర్ సైతం ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉండాలని చెప్పారని.. తాను ఫాలో అయిన డైట్ మాత్రం అస్సలు పాటించవద్దని తెలిపింది. ప్రస్తుతం మాళవిక చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

ప్రస్తుతం మాళవిక ప్రభాస్ జోడిగా రాజా సాబ్ చిత్రంలో నటిస్తుంది. హారర్ కామెడీ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ సైతం కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ మూవీతో మాళవిక తెలుగు తెరకు పరిచయం కాబోతుంది.