
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు హిందీలో సెటిల్ అయిన భామ.. ముందుగా తెలుగులోనే నటించింది. మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడే వరుస సినిమాల్లో నటిస్తుంది.

తెలుగులో నాగచైతన్యతో దోచేయ్, ప్రభాస్ తో రామాయణం చిత్రాల్లో నటించింది. కానీ ఎక్కువగా హిందీలోనే నటిస్తుంది ఈ అమ్మడు. తాజాగా తన కాలిపై టాటూ వేయించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ ఆ టాటూ మీనింగ్ కూడా చెప్పేసింది.

కృతి సనన్ ఇప్పటివరకు ఒంటిపై ఒక్క టాటూ వేయించుకోలేదట. కానీ మొదటిసారి ఒక టాటూ వేయించుకుంది. తన కాలు మీద ఎగిరే పక్షి టాటూగా వేయించుకుంది. అంతేకాకుండా ఈ టాటూ కింద ఆసక్తికర కొటేషన్ రాసుకొచ్చింది ఈ అమ్మడు.

నేను కూడా టాటూ వేయించుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ మొదటిసారి టాటూ వేయించుకున్నాను. ఇన్నాళ్లకు నా వాగ్దానం నెరవేరింది. పక్షిలాగే నేను కూడా సూర్యొదయంలో ఎగురుతూ స్వేచ్ఛా జీవితాన్ని గడపాలని చూస్తున్నాను.

కళ్లతో కలుల కంటున్న ఎవరైనా సరే మీరు భయపడే ఆ ఎత్తును తీసుకోండి. ఇది సులభం కాకపోవచ్చు. కానీ మీరు మీ మార్గాలను కనుగొంటారు. ఎగరడం నేర్చుకుంటారు. జీవితంలో ముందడుగు వేయాలి అనే లక్ష్యంతో ఆ టాటూ వేయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.