సీనియర్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నారు జ్యోతిక.
ఇప్పటి వరకు సౌత్ ఇండియన్ సినిమాల్లో ఎక్కువగా కనిపించరు జ్యోతిక. విశేషమేమిటంటే జ్యోతిక బాలీవుడ్ నుంచి కెరీర్ ప్రారంభించింది..
అయినప్పటికీ హిందీ చిత్ర పరిశ్రమలో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అందుకు కారణం ఏమిటో తాజాగా జ్యోతిక ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించింది.
ఇటీవల విడుదలైన ‘షైతాన్’ సినిమాలో అజయ్ దేవగన్ సరసన జ్యోతిక నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.
ఇప్పుడు హిందీలో ‘శ్రీకాంత్’లో రాజ్‌కుమార్‌రావుతో కలిసి నటిస్తుంది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు చూపించటమే కాదు.. బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అవుతున్నారు సీనియర్ హీరోయిన్ జ్యోతిక.