
ఐశ్వర్య మీనన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అందం, అభినయం కలగలసిన ఈ బ్యూటీకి ఇప్పుడు అంతగా అవకాశాలు రావడం లేదు. తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్పై సినిమాతో అరంగేట్రం చేసింది. కానీ ఈ మూవీ నిరాశే మిగిల్చింది.

ఈ సినిమా అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. తర్వాత కార్తికేయతో భజే వాయువేగం చిత్రంలో నటించింది. ఆ సినిమా సైతం అంతగా ఆకట్టుకోలేకపోయింది. వరుసగా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు. దీంతో ఈ బ్యూటీకి గుర్తింపు రాలేదు.

చాలా కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందం, గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. అటు ట్రెడిషనల్.. ఇటు గ్లామర్ లుక్స్ లో నెటిజన్లను కట్టిపడేస్తుంది ఈ వయ్యారి.

తాజాగా ఐశ్వర్య షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. మోడ్రన్ లుక్స్ లో మరింత అందంగా మెరిసిపోతుంది ఐశ్వర్య. ఈ అమ్మడు తమిళం, మలయాళం చిత్రాల్లో నటించింది. ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతంలో జన్మించిన ఐశ్వర్య.. కాదలిల్ సోదప్పువదు ఎప్పడి సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత దశావళ సినిమాతో కన్నడ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీకి అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు.