
తమిళ చిత్రపరిశ్రమలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో దివ్య భారతి ఒకరు. జీవీ ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ సినిమాతో అందం, అభినయంతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది ఈ వయ్యారి.

ఆ తర్వాత మరోసారి జీవీ ప్రకాష్ సరసన జతకట్టింది. అలాగే తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటుంది. మరోవైపు సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది దివ్య భారతి. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన బంగారు రంగు చీరలో ఫోటోషూట్స్ అందరిని మెస్మరైజ్ చేస్తున్నాయి.

బంగారు రంగు చీరకట్టులో ట్రెడిషనల్ లుక్ తో మరింత అందంగా ముస్తాబయ్యింది దివ్య భారతి. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరల్ గా మారాయి. ఇటు ట్రెడిషనల్.. అటు గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట నానా రచ్చ చేస్తుంది ఈ వయ్యారి.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. తెలుగులో ఆమె నటిస్తున్న గోట్ చిత్రానికి నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తుండగా.. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.