
'బ్యాచిలర్' సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన దివ్య భారతి అభిమానుల ఆదరణ పొందింది. జి.వి.ప్రకాష్ సరసన ఆమె నటించిన తొలి చిత్రం యూత్‌ను ఆకట్టుకుంది.

ప్రస్తుతం మలయాళ చిత్రం ఇస్కీకి తమిళ రీమేక్ అయిన ఆసిలో నటిస్తున్నారు. అలాగే 'బ్యాచిలర్' సక్సెస్ తర్వాత మళ్లీ జివితో కలిసి 'కింగ్స్టన్' సినిమాలో నటిస్తుంది.

అభిమానులను ఆకట్టుకోవడానికి ఆమె తరచూ తన ఫోటోషూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

చీరకట్టులో మరింత అందంగా.. సింపుల్ గా కనిపిస్తుంది ఈ బ్యూటీ. చీరకట్టులోనూ మరింత గ్లామర్ లుక్ తో నెట్టింట మాయ చేస్తుంది ఈ బ్యూటీ.

ప్రసుతం సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీతోనే తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది దివ్యభారతి.