
సేవ్ ద టైగర్స్ లో హై ప్రొఫైల్ ఫెమినిస్ట్ లాయర్ గా నటించి ఆకట్టుకుంది అందాల భామ దేవయాని శర్మ. ఈ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది.

ఆకాష్ పూరి, కేతిక శర్మ నటించిన రొమాంటిక్ సినిమాలో ఆకాష్ ఫ్రెండ్ గా కనిపించింది. అలాగే మహివి రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన సైతాన్ అనే వెబ్ సిరీస్ లో బోల్డ్ పాత్రలో నటించింది దేవయాని శర్మ.

2020లో భానుమతి రామకృష్ణ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది దేవియాని. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినా ఈ అమ్మడు అందరి దృష్టి ఆకర్షించింది. ఆతర్వాత రొమాంటిక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

షైతాన్ వెబ్ సిరీస్ లో దేవయాని చేసిన క్యారెక్టర్ రఫ్ అండ్ బోల్డ్ గా ఉంటుంది. కానీ ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఓ రేంజ్ లో నటించి ఆకట్టుకుంది. దాంతో ఇప్పుడు ఈ అమ్మడికి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

ఇక ఈ చిన్నదాని సోషల్ మీడియా చూస్తే షేక్ అవ్వాల్సిందే. అందాల ఆరబోతతో అదరగొడుతోంది దేవయాని శర్మ.

మత్తెక్కించే ఫోజులతో ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ఈ హాట్ బ్యూటీ. కుర్రాళ్ళు ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.