ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేసి ఆకట్టుకుంది అందాల భామ భావన
మలయాళం హీరోయిన్ భావన పై జరిగిన లైంగిక దాడి ఐదేళ్ల క్రితం ఎంత సంచలనమైందో తెలిసిందే.
భావనని కిడ్నాప్ చేసి కొంత మంది దుండగులు అత్యాచారం చేసారు. ఈ దాడి వెనుక మాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ సూత్రధారిగా ఆరోపణలు వచ్చాయి
ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. అసలు నిందుతులకు ఇంకా శిక్ష పడలేదు. ఈ విషయంలో మీడియా సైంత భావన పేరుని పెద్దగా హైలైట్ చేయలేదు.
అయితే కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ఈసారి నేరుగా భావన ముందుకొచ్చారు. ఇటీవలే ఈ కేసు పురోగతి గురించి కేరళ ముఖ్యమంత్రి విజయ్ ని బహిరంగ లేఖ రాసారు.
2019 వరకూ సోషల్ మీడియాలో లేను. అప్పుడే ఇన్ స్టా గ్రామ్ లోకి వచ్చాను. లైంగిక దాడి తర్వాత ఇంకా ఎందుకు బ్రతికున్నావ్? నీలాంటి వాళ్లకు బ్రతికే అర్హత లేదంటూ అంటూ ఎన్నో కామెంట్లు చేసారు.
వాటన్నింటిని ఇన్నాళ్లు భరిస్తూ వచ్చాను. తప్పు చేయనప్పుడు నేనెందుకు దాక్కోవాలి. ఎందుకు మౌనం వహించాలి? అనే ఉద్దేశంతోనే దాడి విషయంలో ఓపెన్ గా మాట్లాడుతున్నాను. అందుకే సీఎంకి లేఖ ఇలా ఓపెన్ అవ్వడం ఎంతో మంది మద్దతుగా నిలుస్తున్నారు అని చెప్పుకొచ్చింది.