
చిన్నారి పెళ్లికూతురు అనగానే అవికా గోర్ గుర్తుకోచేస్తుంది. అంతలా ఆ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. సీరియల్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవికా ఆతర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేసింది.

తెలుగులో రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాలా జంపాల సినిమాతో ప్రేక్షకులను హీరోయిన్ గా పలకరించింది. ఈ ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి విజయాలను అందుకుంది.

ఆతర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు అందుకుంది. రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్తా మామ అనే సినిమాతో మరో హిట్ అందుకుంది. ఆతర్వాత రాజుగారి గది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది.

కానీ ఈ చిన్నది హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ కూడా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఆతర్వాత ఈ చిన్నదని మెల్లగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.