2005లో వచ్చిన సూపర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార అనుష్క. తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సంపాదించుకున్న అనుష్క అనంతరం వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోయింది.
ఇక 2009లో వచ్చిన అరుంధతి చిత్రం అనుష్క కెరీర్‌ను ఒక్కసారిగా మలుపుతిప్పింది. అనుష్క చేసిన లేడీ ఓరియెంటెండ్ సినిమాలకు ఈ చిత్రమే బీజాన్ని వేసింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడిందీ బ్యూటీ.
ఇక బాహుబలి చిత్రంలో ప్రభాస్ సరసన నటించిన తర్వాత ఇండియన్ మూవీ లవర్స్‌ను తనవైపు తిప్పుకున్న అనుష్క.. ఉత్తరాదిలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇదిలా ఉంటే అనుష్క మొదట తన కెరీర్‌ను యోగా టీచర్‌గా మొదలు పెట్టి తర్వాత నటిగా మారిన విషయం తెలిసిందే.
అనుష్క ఆస్తుల విలువ రూ. 142 కోట్లన్న విషయం మీకు తెలుసా.? దక్షిణాదిలో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే నటిగా గుర్తింపు సంపాదించుకున్న అనుష్క నివసిస్తోన్న ఇళ్లు విలువ ఏకంగా రూ. 12 కోట్లు.
అనుష్క కుటుంబం విషయానికొస్తే ఆమె ఇంట్లో అందరూ డాక్టర్లు, ఇంజనీర్లే కానీ అనుష్క ఒక్కతే టీచర్ కెరీర్‌ను ఎంచుకుంది. అయితే టాలీవుడ్‌లో పరిచయాలతో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.
ఇక 39 ఏళ్ల వయసులోనూ ఇంకా వివాహం చేసుకొని అనుష్క పెళ్లిపై పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో అనుష్క, ప్రభాస్ వివాహం చేసుకోనున్నారని వార్తలు వచ్చాయి. అయితే తాము మంచి స్నేహితులం మాత్రమేనని అనుష్క క్లారిటీ కూడా ఇచ్చింది. మరి అనుష్క ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ.. మనం కూడా బర్త్‌డే విషెస్ చెప్పేద్దామా.