Narender Vaitla |
Aug 15, 2021 | 10:16 AM
ప్రేమమ్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన అందాల తార అనుపమ పరమేశ్వరన్.. అనతి కాలంలోనే నటిగా మంచి పేరు సంపాదించుకుంది.
తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా స్టార్‌గా మారింది. ప్రస్తుతం తెలుగులో '18 పేజీస్'తో పాటు తమిళంలో ఓ సినిమాలో నటిస్తోందీ చిన్నది.
ఇక సినిమాలతో నిత్యం బిజీగా ఉండే అనుపమ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తుంది.
తాజాగా చీరకట్టులో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిందీ అందాల తార. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
పట్టు చీరలో మెరిసిపోతున్న అను.. అచ్చంగా దేవ కన్యలా కనిపిస్తోందని ఫ్యాన్స్ కామెంట్లు కురిపిస్తున్నారు.