
దక్షిణాది చిత్రపరిశ్రమలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. అచ్చ తెలుగు అమ్మాయి అయినప్పటికీ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది.

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తన సినీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన తల్లి నుంచి తాను ఎంతో స్పూర్తి పొందానని తెలిపింది.

చిన్నతనంలోనే తన తండ్రి చనిపోయారని.. దీంతో అమ్మ ఒక్కరే ఎంతో కష్టపడి తమను పెంచిందని.. ఈ ప్రయాణంలో ఆమె మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడిందని తెలిపింది. చిన్న వయసులోనే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేశానని.. ఆ తర్వాత సినీరంగంలోకి అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చింది.

రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ.. లవ్ కంటే కూడా బ్రేకప్ అయినప్పుడు వచ్చే బాధ అంటే భయం. ప్రేమించే సమయం కంటే అది మిగిల్చిన బాధ నుంచి బయటకు రావడానికే ఎక్కువ సమయం తీసుకుంటాను. గతంలోనూ నేను రిలేషన్ లో ఉన్నానని తెలిపింది.

సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఓ వ్యక్తిని ప్రేమించానని.. అతడు తనను ఎంతో వేధించాడని.. అంతకంటే ముందు కూడా అలాంటి ప్రేమనే చూశానని.. రిలేషన్ షిప్ లో ఎందుకు ఇలా జరుగుతుందని భయపడ్డానని.. ప్రస్తుతానికి ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది.