ప్రస్తుతం తెలుగు తెరపై కొత్త అందాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే మలయాళీ కుట్టి సంయుక్త మీనన్ త్రిబుల్ హిట్స్ అందుకుని ఫుల్ ఫాంలో ఉండగా.. మరో కన్నడ సోయగం సైతం సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఆమె ముద్దుగుమ్మనే ఆశికా రంగనాథ్.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఆషికా. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఆషికా నటనకు మంచి మార్కులే పడ్డాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆషికా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కాలేజీ రోజుల్లో అందాల పోటీల్లో సరదాగా పాల్గొంటే.. క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ అవార్డ్ వచ్చిందన్నారు.
ఆ ఫోటోస్ బయటకు వచ్చి.. క్రేజీ బాయ్ మూవీలో ఛాన్స్ వచ్చిందని.. తన సోదరి కూడా ఇండస్ట్రీలో ఉండడంతో తనకు సినిమాల్లో నటించాలని ఆసక్తి కలిగిందని అన్నారు.
ఆ ఫోటోస్ బయటకు వచ్చి.. క్రేజీ బాయ్ మూవీలో ఛాన్స్ వచ్చిందని.. తన సోదరి కూడా ఇండస్ట్రీలో ఉండడంతో తనకు సినిమాల్లో నటించాలని ఆసక్తి కలిగిందని అన్నారు.
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పునీత్ రాజ్ కుమార్ తో కలిసి నటించాలనే కోరిక ఉండేదని.. తాను కోరుకున్నట్లే ఆయనను రెండుమూడు సార్లు కలిశానని తెలిపింది.
చివరకు ఆయనతో నటించే అవకాశం వచ్చిందని.. కానీ అంతలోనే ఆయన మరణించారని...ఆ కోరిక కలగా మిగిలిపోయిందన్నారు.
భవిష్యత్తులో రాజమౌళి మూవీలో నటించాలని ఉందని.. ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని అన్నారు ఆషికా.
కోరిక కలగా మిగిలిపోయింది.. ఆ స్టార్ హీరోతో నటించే ఛాన్స్.. అంతలోనే.. ఆషికా మనసులోని మాటలు..
కోరిక కలగా మిగిలిపోయింది.. ఆ స్టార్ హీరోతో నటించే ఛాన్స్.. అంతలోనే.. ఆషికా మనసులోని మాటలు..