
చియాన్ విక్రమ్ నటించిన వీర ధీర సూరన్ సినిమా మార్చి 27, 2025న థియేటర్లలో విడుదలైంది. ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈ క్రమంలోనే వీర ధీర సూరన్ సినిమాకు విక్రమ్ తీసుకున్న పారితోషికం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. కోయిమోయ్ నివేదిక ప్రకారం ఈ సినిమాకు విక్రమ్ 30 కోట్ల రూపాయల భారీ పారితోషికం అందుకున్నట్లు టాక్.

ఇది వీర ధీర సూరన్ సినిమా బడ్జెట్‌లో సగానికి పైగా ఉంటుందని టాక్. నివేదికల ప్రకారం ఈ చిత్రానికి రూ.30 కోట్లు పారితోషికం తీసుకున్నప్పటికీ.. అది మొత్తం రెండు భాగాలకు కలిపి ఉంటుందని తెలుస్తోంది.

వీర ధీర సూరన్ రెండు భాగాలు కలిపి మొత్తం బడ్జెట్ రూ.100 -110 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. అంటే విక్రమ్ పారితోషికం మొత్తం సినిమాలో సగం కంటే తక్కువే. అయితే ఈ విషయంపై సరైన స్పష్టత రాలేదు.

ఈ సినిమా ఫస్ట్ పార్ట్ మార్చి 27న విడుదలైంది. అయితే మొదటి రోజే ఆర్థిక సమస్యల పరిష్కారంతో కొన్ని థియేటర్లలో ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ ఆలస్యంగా జరిగింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.