బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ సౌత్ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారా..? ఒకేసారి ఆమిర్ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా...? ఇదే ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్. సౌత్‌లో ఓ స్టార్ హీరో సినిమాతో పాటు, ఓ సూపర్ హిట్ సీక్వెల్‌లోనూ నటించేందుకు ఆమిర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.
లాల్ సింగ్ చద్దా ఫెయిల్యూర్‌తో డైలమాలో పడ్డ ఆమిర్ ఖాన్, ఒక దశలో సినిమాలకు గుడ్ బై చెప్పేయాలన్న అన్న ఆలోచనకు వచ్చారు. కానీ అబిమానుల రిక్వెస్ట్‌తో ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్న ఈ సీనియర్ స్టార్, మూవీ సెలక్షన్ విషయంలో పూర్తిగా కొత్త దారిలో వెళ్లాలని ఫిక్స్ అయ్యారు.
ఇన్నాళ్లు సౌత్ సినిమాతో అంటీ ముట్టనట్టుగా ఉన్న ఆమిర్ ఖాన్, త్వరలో సౌత్ డెబ్యూకి రెడీ అవుతున్నారు. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమిర్ ఖాన్ కీలక పాత్రలో నటించబోతున్నారన్న టాక్ చాలా కాలంగా వినిపిస్తోంది.
తాజాగా మరో తమిళ మూవీ విషయంలోనూ ఆమిర్ పేరు వినిపిస్తోంది. బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న తనీ ఒరువన్ 2లో ఆమిర్ ఖాన్ నటించబోతున్నారట. తొలి భాగంలో అరవింద్ స్వామి విలన్‌గా నటించారు. ఇప్పుడు సీక్వెల్ విషయంలో ఆమిర్ పేరు తెర మీదకు రావటంతో ఆయన కూడా విలన్‌గా నటిస్తారా అన్న అనుమానాలు రెయిజ్ అవుతున్నాయి.
ఆల్రెడీ ధూమ్ 3లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు ఆమిర్. ఇప్పుడు తనీ ఒరువన్ 2లోనూ అలాంటి పాత్ర చేస్తే ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే ప్రస్తుతానికి సౌత్ సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతున్న ఈ వార్తలపై ఆమిర్ టీమ్ మాత్రం ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు.