
మాంసాహారులకు చికెన్ అంటే మహా ఇష్టం. రకరకాల చికెన్ వంటకాలు తినడానికి ఆసక్తి చూపుతుంటారు. చికెన్ తినడం వల్ల శరీరానికి గరిష్ట ప్రోటీన్ అందుతుంది. పైగా ప్రోటీన్ కూడా దండిగా అందుతుంది. ఇంకొంతమంది మాంసాహారం కంటే శాఖాహారం తినడానికి ఇష్టపడతారు.

అలాగే మొలకెత్తిన గింజలు తినడం వల్ల కూడా శరీరానికి అవసరమైన ప్రోటీన్ అధికంగానే లభిస్తుంది. శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరానికి సరైన మొత్తంలో ప్రోటీన్ అందితే కండరాలు బలంగా మారుతాయి. ప్రోటీన్ శరీరానికి బలాన్ని ఇస్తుంది. అయితే మాంసాహారమే కాదు.. కొన్ని శాఖాహార ఆహారాలు కూడా అధిక ప్రోటీన్ అందిస్తాయి.

చాలా మంది శాఖాహారులు ప్రోటీన్ పొందడానికి మొలకెత్తిన పెసలు తింటారు. అయితే 100 గ్రాముల చికెన్‌లో ఎక్కువ ప్రోటీన్ ఉందా? లేదా 100 గ్రాముల మొలకల్లో ఉందా? అనే సందేహం కలిగితే.. 100 గ్రాముల మొలకల్లో దాదాపు 7.02 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

అదే 100 గ్రాముల చికెన్‌లో దాదాపు 31 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మొలకెత్తిన పెసలులో ప్రోటీన్ తక్కువగా ఉంటుంది. కానీ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది.

మరోవైపు, చికెన్‌లో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. మీరు అధిక ప్రోటీన్ ఆహారం తినాలనుకుంటే చికెన్ తినవచ్చు. చికెన్‌తో పాటు, మొలకెత్తిన పెసలు, సోయాబీన్స్ వంటి శాఖాహారల నుంచి కూడా ప్రోటీన్ పొందవచ్చు.