Chicken vs Egg: చికెన్ లేదా గుడ్డు.. దేనిలో ఎక్కువ ప్రోటిన్ ఉటుంది.. ఫిట్‌నెస్ కోసం ఏది బెస్ట్!

Updated on: Mar 27, 2026 | 5:46 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది పిట్‌గా కనిపించాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం ఫిట్‌నెస్ పట్ల అవగాహన పెంచుకోవడంతో పాటు తమ డైట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, క్యాలరీలను లెక్కించుకొని, ప్రోటీన్ తీసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రోటీన్ కోసం శాఖాహారులు పనీర్, టోఫు వంటివి తీసుకుంటే, మాంసాహారులు చికెన్, గుడ్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కాబట్టి చికెన్, గుడ్లు రెండింటిలో దేనిలో ఎక్కువ ప్రోటిన్ ఉంటుందో ఇప్పుడు చూద్దాం

1 / 5
గుడ్డు వర్సెస్ చికెన్: గుడ్లు, చికెన్ రెండింటిలోనూ ప్రోటీన్‌కు పుష్కలంగా ఉంటుంది. కానీ బరువు ప్రకారం గుడ్ల కంటే చికెన్ బ్రెస్ట్‌లో సుమారు 4-5 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని మీకు తెలుసా? అయితే, గుడ్డులోని ప్రోటీన్ అధిక నాణ్యతను కలిగి ఉంటుంది. దీన్ని మన బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి, ఈ రెండింటి పోషక విలువలను పోల్చి చూసి, ప్రోటీన్‌కు ఏది ఉత్తమ వనరు అని తెలుసుకుందాం?

2 / 5
గుడ్డు ప్రయోజనాలు: గుడ్డులో నాణ్యమైన ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఒక పెద్ద గుడ్డులో సుమారు 6–7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే ఇఇందులో విటమిన్ A, B12, కోలిన్, హెల్తీ ఫ్యాట్స్, విటమిన్ D కూడా ఉంటాయి. అంతేకాదు గుడ్డును 'కంప్లీట్ ప్రోటీన్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో శరీరానికి కావాల్సిన 9 ముఖ్యమైన అమినో యాసిడ్స్ ఉంటాయి. దీని 'బయోలాజికల్ వాల్యూ' 100గా పరిగణించబడుతుంది, అంటే దీనిలోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహిస్తుంది.

3 / 5
చికెన్ ప్రయోజనాలు: ఇక చినెక్ విషయానికి వస్తే ఇందులో అధిక ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్‌లో 27–32 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది గుడ్డుతో పోలిస్తే చాలా ఎక్కువ. అలాగే చిన్‌లో ఇందులో నియాసిన్, సెలీనియం, ఫాస్పరస్, విటమిన్ B6, B12 వంటి పోషకాలు కూడా ఉంటాయి. చికెన్‌లో ఫ్యాట్ తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇది బరువు తగ్గాలనుకునే వారికి, భలమైన కండరాలు కోరుకునే వారికి ఉత్తమంగా ఉంటుంది.

4 / 5
గుడ్డు లేదా చికెన్: ప్రోటీన్ కోసం ఏది తినాలి? : మీరు నాణ్యమైన ప్రోటీన్, కండరాల పెరుగుదల, తక్కువ కేలరీలలో ఎక్కువ ప్రోటీన్‌ను కావాలి అనుకుంటే చికెన్ బ్రెస్ట్ ఒక మంచి ఎంపిక. ముఖ్యంగా అథ్లెట్లు, బాడీబిల్డర్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే, మీకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ప్రోటీన్ కావాలంటే, ప్రతిరోజూ 1-2 గుడ్లు తినడం ఉత్తమం.

5 / 5
అయితే మీకు సరైన మోతాదులో, మంచి నాణ్యత గల ప్రోటీన్ కావాలి అనుకుంటే గుడ్లు, చికెన్ రెండింటినీ సమతుల్యంగా ఆహారంలో చేర్చుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మీరు చికెన్ తింటారా లేదా గుడ్లు తింటారా అనేది మీ ఆరోగ్య పరిస్థితులు,  బడ్జెట్, ఆహార ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది.

Follow Us