డయాబెటిస్‌ బాధితులకు అలర్ట్.. ఈ అద్భుతమైన గింజలతో దెబ్బకు షుగర్ కంట్రోల్..

|

Nov 03, 2024 | 1:58 PM

డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అందుకే.. ముందే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చియా విత్తనాలు చాలా మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. అందుకే.. వీటిని తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

1 / 6
 మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మూత్రపిండాల వైఫల్యం, దృష్టి సమస్యలు, నరాల దెబ్బతినడానికి దారితీస్తుంది. అందువల్ల, చక్కెర స్థాయి పెరగకుండా చూసుకోవాలి. సహజసిద్ధంగా చక్కెరను నియంత్రించాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. వాటిలో ఒకటి చియా విత్తనాలు... చియా విత్తనాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.

2 / 6
మధుమేహ వ్యాధిగ్రస్తులకు చియా విత్తనాలు చాలా మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఆల్ఫాలినోలెనిక్ యాసిడ్స్ కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల భోజనం తర్వాత బ్లడ్ షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇది చక్కెరను నియంత్రిస్తుంది. అదనంగా, గుండె సమస్యల ప్రమాదం తగ్గుతుంది. చియా విత్తనాలు కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. దీంతో ఒక్కసారిగా రక్తప్రవాహంలోకి చేరిన గ్లూకోజ్ పరిమాణాన్ని తగ్గించుకోవచ్చు. ఇందులోని ఫైబర్ కంటెంట్ స్పైక్‌లను తగ్గిస్తుంది

3 / 6
ఎనర్జీకి కూడా చియా సీడ్స్ ఆరోగ్యకరమైన అల్పాహారం. వీటిని బాల్స్ (చియా ఉండలు) గా చేసుకోని ఉదయాన్నే తీసుకోవచ్చు.. దీని కోసం చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసి కలపాలి. తీపి కోసం కొద్దిగా ఖర్జూరం పేస్ట్ జోడించవచ్చు. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఖర్జూరం ఇష్టం లేని వారు తేనెను ఉపయోగించవచ్చు.

4 / 6
చియా స్మూతీ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇందులో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఇష్టమైన పండ్లను పాలతో కలపండి. అందులో చియా గింజలు వేసి తినాలి.

5 / 6
చియా పుడ్డింగ్ చాలా సులభం. చియా పుడ్డింగ్ కోసం, చియా గింజలను పాలు, పెరుగుతో కలపండి.. ముందు రోజు రాత్రి ఫ్రిజ్‌లో ఉంచండి. మరుసటి రోజు మీరు తాజా పండ్లతో ఈ పాయసం తినవచ్చు.

6 / 6
సాధారణంగా మజ్జిగ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. దీనికి 2 చెంచాల చియా గింజలను జోడించండి. బాగా కలపి మజ్జిగ తాగండి.. ఇది చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది. (నోట్: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే..  పాటించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోండి.)