
Guava leaves

జామపండుపై ఉండే రసాయనాలు అలెర్జీ సమస్యల్ని కలిగిస్తాయి. దీంతో.. అలర్జీ సమస్యలతో బాధపడేవారు జామపండు ఎక్కువగా తినకూడదంటున్నారు. చర్మ వ్యాధులు, శ్వాసకోస వ్యాధులతో బాధపడేవారు జామపండు ఎక్కువగా తినకూడదు. తింటే.. చర్మంపై దద్దుర్లు, మంట, వాపు వంటి లక్షణాలు కనిపించే ప్రమాదముంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు జామపండును మితంగా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

జామ ఆకులను నీటిలో వేసి మరిగించి ఈ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో సేవిస్తే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. జామ ఆకుల టీ తాగడం వలన బీపీ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. దాంతో పాటు శరీరంలో మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. జామ ఆకులు గర్భిణులు, పాలు ఇచ్చే తల్లులు తీసుకోకూడదు.

Guava Leaves

జామ ఆకుల టీ తాగితే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జామ ఆకుల్లో ముఖంపై ఉండే మచ్చలు పోగొట్టే విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఈ టీ తాగడంతో జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. జామ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో జుట్టు కుదుళ్లకు మసాజ్ చేయాలి. దీంతో కుదుళ్లు బలంగా మారుతాయి.