
ఎముకలు బలహీనపడటం అనేది ఈ రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. మారుతున్న జీవనశైలి.. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎముకలు కూడా ప్రభావితమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

మీ శరీరానికి అవసరమైన పోషకాలు లభించనప్పుడు లేదా వ్యాయామం చేయకపోతే.. ఎముకలలో నొప్పి, బలహీనపడటం లాంటి సమస్యలు కనిపిస్తాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడడానికి ఇదే కారణం.

అయితే.. కొన్ని రకాల నూనెల సహాయంతో.. ఎముకలు, కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.. దీంతోపాటు ఎముకలు బలపడతాయి. కాబట్టి ఎముకలను పటిష్టం చేసే నాలుగు నూనెల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవాల నూనె : ఆవనూనె ఎముకలను బలోపేతం చేయడంలో చాలా మేలు చేస్తుంది. శరీరానికి బలం చేకూర్చడమే కాకుండా కీళ్ల నొప్పులకు కూడా ఈ నూనె ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఈ నూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకోవచ్చు. మీరు దీని నుంచి ఖచ్చితంగా ప్రయోజనం పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నూనెను ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

బాదం నూనె : బాదం నూనె కూడా మీ ఎముకలను బలంగా చేస్తుంది. ఈ నూనెలో విటమిన్ ఇ ఉంది. ఇది అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఈ నూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతంది.

నువ్వుల నూనె : శరీరానికి నువ్వుల నూనెతో కూడా మసాజ్ చేయవచ్చు. దీని వల్ల కూడా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీ శరీరం ఆరోగ్యవంతంగా మారడంతోపాటు.. చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.

ఆలివ్ నూనె : ఆలివ్ నూనెతో కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని ఉపయోగించడం ద్వారా మీరు శరీర నొప్పి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు. ఈ నూనెతో శరీరానికి క్రమం తప్పకుండా మసాజ్ చేసుకోవాలి.